
రంగారెడ్డి, 28 ఏప్రిల్ (హి.స.)
గ్యాంట్రీ క్రేన్లు ఢీకొని ఐదుగురుమృత్యువాత పడ్డ సంఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో గ్యాంట్రీ క్రేన్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈదురుగాలులు భారీ వర్షానికి క్రేన్లు కూలడంతో ప్రమాదం జరిగిందని షెడ్డులో వర్షానికి తలదాచుకుంటున్న 17 మంది కార్మికులు బలయ్యారని అన్నారు. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన మంగళవారం ఉదయం పరామర్శించారు. మీరు ఏ ప్రాంతం వారు ? ఇక్కడికి ఎన్ని రోజులైంది ? ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాల పై మంత్రి ఆరా తీశారు. కంపెనీ వారితో మాట్లాడి మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం వచ్చేలా చూస్తామన్నారు.
కార్మిక చట్టం ప్రకారంగా వారికి అందే ఎక్స్ గ్రేషియాతో పాటు యాజమాన్యంతో కూడా వారికి పరిహారం అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పూర్తిగా కోల్పోయే వరకు వైద్యం ఖర్చులు కంపెనీ భరిస్తుందని స్పష్టం చేశారు. కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే కంపెనీని సందర్శించాలని పూర్తివివరాలు సేకరిస్తున్నారని జరిగిన ప్రమాదం నిబంధనలకు విరుద్ధంగా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాలింగాపురం గ్రామ పరిధిలోని సంఘటన జరిగిన ప్రాంతాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ తో కలిసి మంత్రి వివేక్ సందర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు