పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పది పరీక్ష ఫలితాలపై కీలక అప్డెట్ వచ్చేసింది.
10 class result


హైదరాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పది పరీక్ష ఫలితాలపై కీలక అప్డెట్ వచ్చేసింది. ఫలితాల విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం డేట్ ఫిక్స్ చేసింది. రేపు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు రిజల్ట్స్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన పరీక్షలు ఈ నెల 13న పూర్తయిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు ఐదు లక్షలకు పైగా విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఇక మూల్యాంకనం సైతం ఈ నెల 23న పూర్తయింది. తొలుత వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలు వెలుపడతాయని అందరూ భావించారు. రేపే(29)న విడుదల చేయనున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande