విజయవాడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికి రాలి బంగారం.చోరీ
విజయవాడ రైల్వే స్టేషన్.లో ఓ ప్రయాణికి రాలి బంగారం చోరీ
విజయవాడ రైల్వే స్టేషన్లో ఓ  ప్రయాణికి రాలి  బంగారం.చోరీ


విజయవాడ, 28 ఏప్రిల్ (హి.స.)

ఒక ప్రయాణికురాలి బంగారం చోరీకి గురవ్వగా రోజుల వ్యవధిలోనే రైల్వే పోలీసులు రికవరీ చేశారు. రామవరప్పాడుకు చెందిన శివకోటి లక్ష్మి ఈ నెల 22వ తేదీ ఉదయం సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు విజయవాడ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. మూడో నెంబరు ప్లాట్ఫారం వద్ద జనరల్ బోగీ ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. కొంత సమయం తర్వాత గమనించిన బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ జేవీ రమణ స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఐదుగురు మహిళలు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టగా నాగ్పూర్ ప్రాంతానికి చెందిన అంతరాష్ట్ర ముఠాగా తేలింది. సోమవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఒకటో నంబరు ప్లాట్ఫాంపై అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో సుమారు రూ.6.80 లక్షలు విలువ చేసే 68 గ్రాముల బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande