
అమరావతి, 28 ఏప్రిల్ (హి.స.)
కడప జిల్లా ప్రొద్దుటూరులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ ప్రైవేట్ కాలేజీ కోసం.. లే అవుట్లో ప్రభుత్వ నిధులతో రహదారి వేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ.. సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై కోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పైవిధంగా స్పందించింది. తమ అనుమతి లేకుండా రహదారి వేశారంటూ లే అవుట్లోని పలువురు భూ యజమానులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలంటూ జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ