
పెద్దాపురం, 28 ఏప్రిల్ (హి.స.)
పెద్దాపురం పట్టణం జవహర్నగర్ కాలనీలోని ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగి రామబ్రహ్మానందాచారి ఇంట్లో ఆదివారం దొంగలుపడి బీరువాలోని రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, బీరువాలోని రూ.1.90 లక్షల నగదు చోరీ చేశారు. రామబ్రహ్మానందాచారి, ఆయన భార్య జయశ్రీ ఈ నెల 19న హైదరాబాద్లో ఉంటున్న కుమార్తె వరలక్ష్మి ఇంటికి వెళ్లారు. కాలనీలో ఇంటి పక్కన నివాసం ఉంటున్న వీరి మనుమడు వివేక్ ఆదివారం తన ద్విచక్ర వాహనం పెట్టుకోవడానికి వెళ్లగా ఇంటి తాళాలు తీసి ఉండడం గమనించి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై మౌనిక, కాకినాడ నుంచి క్లూస్టీమ్, సామర్లకోట నేర విభాగం ఎస్సై కృష్ణారావు, బలరాం, శ్రీహరి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి పాత నేరస్థులే కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ