
కోల్కతా, 03 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఏడు మంది జుడిషియల్ అధికారుల్ని బుధవారం నిరసనకారులు ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన మాస్టర్మైండ్ను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. సిలిగురిలోని బగ్డోగ్రా ఎయిర్పోర్టు నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని మొఫక్కరుల్ ఇస్లామ్గా గుర్తించారు. అతను ఓ అడ్వకేట్. అయితే విమానం ఎక్కేందుకు వెళ్లిన అతన్ని అరెస్టు చేశారు. కాలియాచాక్లో జరిగిన ఘటనలో అతనే మాస్టర్మైండ్ అని, ఓ బీడీఓ ఆఫీసులో ఏడు మంది జడ్జీలను నిర్బంధించారని, పారిపోయేందుకు అతను ఫ్లయిట్ ఎక్కే సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే జుడిషియల్ అధికారుల్ని నిర్బంధించిన ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు 33 మందిని అరెస్టు చేశారు. దాంట్లో ఓ ఐఎస్ఎఫ్ అభ్యర్థి కూడా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi