సీఎం.చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
సీఎం.చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
సీఎం.చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయ్యింది. దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్టసవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపనున్నారు.

హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో చీఫ్ కోర్టు మేనేజర్, సీనియర్ కోర్టు మేనేజర్లు, కోర్టు మేనేజర్లతో కలిపి 21 కొత్త పోస్టులు సృష్టించేందుకు అంగీకారం తెలపనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈటీసీ శిక్షణ కేంద్రాల్లో 20 పోస్టులు సృష్టించే ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. అదనంగా మరో 9 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ప్రతిపాదనకు అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande