వైసీపీ.అధినేత వైఎస్ జగన్.మాజీ సీపీ ఆర్ వో పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు
వైసీపీ.అధినేత వైఎస్ జగన్.మాజీ సీపీ ఆర్ వో పూడి శ్రీహరికి మరోసారి బెయిల్ మంజూరు
వైసీపీ.అధినేత వైఎస్ జగన్.మాజీ సీపీ ఆర్ వో పూడి శ్రీహరికి  మరోసారి బెయిల్ మంజూరు

చిత్తూరు , 30 ఏప్రిల్ (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి మరోసారి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు(గురువారం) కుప్పం కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆయనకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కుప్పం కోర్టులో శ్రీహరికి బెయిల్ రావడంతో పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande