మాజీ మంత్రి కాకాని గోవర్ధన్.రెడ్డి కి న్యాయస్థానం లో చుక్కెదురు
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్.రెడ్డి కి న్యాయస్థానం లో చుక్కెదురు
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్.రెడ్డి కి న్యాయస్థానం లో చుక్కెదురు


నెల్లూరు, 30 ఏప్రిల్ (హి.స.)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. గత కొంతకాలంగా సాగుతున్న ఫోర్జరీ పత్రాల కేసులో ఆయన దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం ఈరోజే(గురువారం) కోర్టుకు హాజరుకావాలని న్యాయాధికారి గోవర్ధన్ రెడ్డిని ఆదేశించారు.

ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని, అలాగే కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోర్టును కోరారు. అయితే.. అందుకు తగిన ఆధారాలు లేవని భావించిన న్యాయస్థానం.. ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే కేసులో కీలకమైన ఆధారాలు నెల్లూరు కోర్టు ప్రాంగణం నుంచే చోరీకి గురవ్వడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి న్యాయాధికారిని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande