లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
Acb


యాదాద్రి భువనగిరి, 30 ఏప్రిల్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండలం నడిగూడెం సెక్షన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాణోత్ నరేష్ ఏసీబీకి చిక్కాడు. సాయనపల్లి బీట్ ఇన్చార్జిగా పనిచేస్తున్న ఆయన, సాయనపల్లి గ్రామానికి చెందిన ఓ పొడు రైతును ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధిత రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం దాడి నిర్వహించారు. రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలోని బృందం బాణోత్ నరేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande