ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్
ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్
Ex president


రంగారెడ్డి, 30 ఏప్రిల్ (హి.స.)

మనిషి జీవితంలో ధ్యానం మనసుశరీరం సమతుల్యతో సాధించి శాంతి తో ఆధ్యాత్మిక శక్తి పెంపొందించడానికి ధ్యానం ఎంతో తోడ్పడుతుందని మాజీ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం, కన్హ శాంతి వనాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆయనకు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు హార్ట్ ఫుల్ నెస్ దాజి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ మాట్లాడుతూ ఆశ్రమంలో గురుతెగ్ బహదూర్ జి 350 వార్షికోత్సవం సందర్భంగా ధ్యానం ద్వారా అన్ని మతాల ప్రజలు దేశవ్యాప్తంగా సుమారు 30 వేల పైన అధికంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. హార్ట్ ఫుల్ నెస్ ద్వారా అన్ని మతాల ప్రజలు ఒకే వేదికపై చేర్చడం గురుతెగ్ బహదూర్ సత్యమని మానవ హక్కులను సంరక్షించడం అందరికీ మత స్వేచ్ఛను కాపాడటం గురుదేగ్ బోధనలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, వివేక అగర్వాల్, సునీల్ దత్, పలంగర్ ఎమ్మెల్యే ఆర్పీత్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande