
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)ఏపీ నుంచి మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లు వెళ్లనున్నాయి. అమరావతి టూ చెన్నై, బెంగళూరు కనెక్టివిటీ లభించేలా ఒక ప్రాజెక్ట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పంపారు. ఇక మైసూర్-చెన్నై కారిడార్ను నాయుడపేటకు లింక్ చేయాలని ప్రతిపాదించారు. చంద్రబాబు సూచనలతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వీటిని ప్రాజెక్టులో చేర్చింది. గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్ నిర్మించాలని సూచించగా.. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూర్కు మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ఉండాలని ప్రతిపాదించారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించాలని ఇటీవల కేంద్ర బడ్జెట్లో పొందుపర్చింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైల్ కారడార్లు ఏమీ మీదుగా వెళ్లనున్నాయి. వీటికి సంబంధించి అలైన్మెంట్ సిద్దం చేస్తున్నారు. ఆలైన్మెంట్ పూర్తయ్యాక డీపీఆర్ రెడీ చేయనున్నారు. డీపీఆర్ సిద్దమయ్యాక టెండర్లను ఆహ్వానించి పనులను మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించి వేగంగా పనులు మొదలుపెడుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV