
హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. చిలకలగూడ, ఆదిభట్ల, సనత్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, రూ.64.35 లక్షల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.
ఈ ఆపరేషన్లో డ్రగ్స్తో పాటు రూ.50,000 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో ఉద్యోగాలు చేశారని, ఆ తర్వాత టైల్స్ వ్యాపారం నిర్వహించినట్లు చెప్పారు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలోకి వచ్చారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi