ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినేషన్లు.. జాబితాలో సంజు, బుమ్రా పేర్లు
మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఐసీసీ తాజాగా వెల్లడించింది.
Sports


హైదరాబాద్, 06 ఏప్రిల్ (హి.స.)మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఐసీసీ తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబర్చిన స్టార్ బ్యాటర్ సంజు శాంసన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో నిలిచారు.

టీ20 ప్రపంచ కప్ 2026లో అనూహ్యంగా జట్టులోకి సంజు శాంసన్.. కీలక మ్యాచుల్లో అసాధారణ ప్రదర్శన చేశాడు. సూపర్ 8లో అమీ తుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సంజు చెలరేగాడు.

ఇక బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. తన కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande