
అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఏడాది కాలంగా జైలులో ఉన్న ఆయనకు కోర్టు ఉపశమనం కలిగించింది. అయితే, గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే, ఏపీ లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. లిక్కర్ విధానంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో కీలక వ్యక్తిగా భావించిన రాజ్ కేసిరెడ్డిని ఏ1గా చేర్చిన అధికారులు, గతంలో అరెస్ట్ చేశారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ నిర్ణయం కేసు దర్యాప్తుపై, తదుపరి న్యాయ ప్రక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్