దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
విజయవాడ, గుంటూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు చేస్తున్న ఆకస్మిక దాడులు
Endowment dept


గుంటూరు, 07 ఏప్రిల్ (హి.స.)విజయవాడ, గుంటూరు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు చేస్తున్న ఆకస్మిక దాడులు కలకలం రేపుతున్నాయి. తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కలిగిరి శాంతి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆమె నివాసానికి చేరుకున్న ఏసీబీ బృందాలు పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. విజయవాడ, తాడేపల్లిలోని శాంతికి చెందిన మూడు ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande