
హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)పని తీరు విషయంలో శామీర్పేట్ పోలీస్స్టేషన్కు జాతీయ స్థాయి ఏడో ర్యాంకు, రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. అవినీతి, సెటిల్మెంట్లు, ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరణ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న శామీర్పేట పోలీస్స్టేషన్కు అత్యుత్తమ ర్యాంకులు ఇవ్వడం సరి కాదంటూ శామీర్పేట్కు చెందిన లోకహిత సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం.. పోలీస్స్టేషన్కు వచ్చిన ర్యాంకు వల్ల పిటిషనర్కు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించింది. ఈ మేరకు పిటిషనర్ తరఫున న్యాయవాదులు గౌతమ్, లిఖిత్రెడ్డి వాదిస్తూ.. గతంలో ఈ పీఎస్ అధికారి ఒకరు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని, ఇలాంటి స్టేషన్కు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు ఇవ్వడమంటే ర్యాకింగ్ వ్యవస్థ విశ్వసనీయతపై అనుమానం వస్తోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. శామీర్పేట్ పోలీ స్స్టేషన్కు ర్యాంకులు రావడంపై రాష్ట్ర హోంశాఖ వైఖరి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్