విహార నౌక బోల్తా పడి నలుగురు మృతి- మరో 15మంది గల్లంతు
విహార నౌక బోల్తా పడి నలుగురు మృతి- మరో 15మంది గల్లంతు
boat


జబల్పూర్ , 01 మే (హి.స.)

మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తుపాను కారణంగా నర్మదా నదిలో సుమారు 35 నుంచి 40 మంది ప్రయాణిస్తున్న ఒక విహార నౌక ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, సుమారు 15 మంది గల్లంతయ్యారు. నౌక నుంచి 18 మంది సురక్షితంగా కాపాడినట్లు పోలీసులు చెప్పారు. గల్లంతైన వారి కోసం SDRFతోపాటు ఇతర సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నదిలో సుడిగుండం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మోహన్ యాదవ్ హామీ ఇచ్చారు.

డ్యామ్ జలాశయంలో క్రూయిజ్ బోటు బోల్తా పడిన తర్వాత గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పోలీసులతో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) సంయుక్త బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. గజఈతగాళ్లు, మోటార్ బోట్లు, స్పీడ్బోట్లు సహాయంతో ఆపరేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే, 29 టికెట్లు విక్రయించినట్లు అధికారులు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande