బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
Droupadi Murmu


న్యూఢిల్లీ: , 01 మే (హి.స.)

ఇవాళ బుద్ద పూర్ణిమ(Buddha Purnima). ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్దుడి బోధనలు శాంతి, అహింస, జ్ఞానాన్ని బోధిస్తాయన్నారు. మానవళికి ఆయన బోధనలు మార్గాన్ని చూపాయన్నారు. రాష్ట్రపతి ముర్ము తన ఎక్స్లో ఓ పోస్టు చేశారు. బుద్దపూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాని, పౌరులందరికీ, బుద్ధ భగవానుడి ఫాలోవర్లకు బెస్ట్ విషెస్ అని ఆమె పేర్కొన్నారు. బుద్ద భగవానుడు ఈనేలపై అవతరించిన రోజు అని, దయ..కరుణ, శాంతి, అహింస లాంటి ఆయన బోధనలు మానవాళికి మార్గదర్శనం చేస్తాయన్నారు. నేటి సమాజం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే బుద్దుడి బోధనలతో ఆ సమస్యలను అధిగమించవచ్చు అన్నారు. బుద్దుడి ఆశయాలను, ఆదర్శాలను స్వీకరించి శాంతియుత, సమగ్ర సమాజ నిర్మాణానికి సహకరించాలని ముర్ము కోరారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande