పవన్ ఖేరాకు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
పవన్ ఖేరాకు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court


న్యూఢిల్లీ:, 01 మే (హి.స.)

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఇవాళ ఆయనకు ముందస్తు బెయిల్ను మంజూరీ చేసింది. అస్సాంలో నమోదైన పరువునష్టం, ఫోర్జరీ కేసులో ఆయనకు ఊరట దొరికింది. జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది. ముందస్తు బెయిల్ జారీ చేసేందుకు గౌహతి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్కు పలు దేశాల్లో పాస్పోర్టులు, ఆస్తులు ఉన్నట్లు ఇటీవల పవన్ ఖేరా ఆరోపించారు.

ఆ ఆరోపణల నేపథ్యంలో ఖేరాపై అస్సాంలో పోలీసు కేసు పెట్టారు. ఏప్రిల్ 7న ఢిల్లీలోని ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు వెళ్లారు. కానీ అక్కడ ఆయన ఉన్నట్లు గుర్తించలేదు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఖేరా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు 10 రోజుల రిలీఫ్ ఇచ్చింది. కానీ ఏప్రిల్ 15వ తేదీన తెలంగాణ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత ఖేరా గౌహతి కోర్టుకు వెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande