ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద హైటెక్ భద్రత- క్యూఆర్ కోడ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ: ఈసీ
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద హైటెక్ భద్రత- క్యూఆర్ కోడ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ: ఈసీ
EVM commissioning process completed


చెన్నై, 01 మే (హి.స.)

: కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించడానికి మూడు అంచెల భద్రతా ఏర్పాట్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం క్యూ ఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఈసీ పేర్కొంది. అదేవిధంగా, భవిష్యత్తులో జరిగే అన్ని లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపింది.

అయితే, కౌంటింగ్ కేంద్రాల్లో గుర్తింపును ధ్రువీకరిచడం కోసం మూడు అంచెల భద్రతా విషయంపై ఈసీ వివరణ ఇచ్చింది. మొదటి, రెండు భద్రతా చెక్పాయింట్ల వద్ద రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను మాన్యువల్గా తనిఖీ చేస్తారని తెలిపింది. అలాగే, కౌంటింగ్ హాల్ సమీపంలో లోపలి భద్రతా వలయం వద్ద క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతి ఉంటుందని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించడానికి ఈసీ అనుమతి పొందిన వ్యక్తులకు సైతం ఈ నూతన మార్గదర్శకాలు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది. వీరిలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande