
న్యూఢిల్లీ, 01 మే (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. 2025లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంశలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, పిటిషనర్ వాదానలు విన్న అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.
జస్టిస్ విక్రమ్ డి చౌహాన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్కు సంబంధించిన వివరాల ప్రకారం.. 2025, జనవరి 15న జరిగిన ఒక ఏఐసీసీ మీటింగ్లో రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాము ఆర్ఎస్ఎస్, బీజేపీతోపాటు ప్రభుత్వంతో కూడా పోరాడుతున్నాం అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని సిమ్రాన్ గుప్తా అనే మహిళ భావించారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో సిమ్రాన్.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని కోరారు. దీనిపై విచారించిన కోర్టు సిమ్రాన్ పిటిషన్ను కొట్టివేసింది. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పక్కనబెట్టాల్సిన అవసరం లేదని, ఆ కోర్టు ఆదేశాల్ని పాటించాల్సిందే అని ఆదేశించింది. రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi