ముంబైలో భారీగా కొకైన్ పట్టివేత
ముంబైలో భారీగా కొకైన్ పట్టివేత.
కొకైన్


ముంబై, 01 మే (హి.స.)

ముంబైలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఛేదించింది. ఆ ముఠా నుంచి రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah) ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే ముఠాలను అణచివేయాలని నిర్ణయించుకున్నట్లు అమిత్షా తెలిపారు. ఇందులోభాగంగా.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాపై ఉక్కుపాదం మోపిందన్నారు.

ముంబైలో రూ.1,745 కోట్ల విలువైన 349 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక చిన్న సరకును గుర్తించి.. దాని నుంచి ఒక భారీ నెట్వర్క్ను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ విజయానికిగాను ఎన్సీబీ బృందాన్ని ఆయన అభినందించారు. కాగా అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీమ్ డోలాను ఇటీవల తుర్కియే నుంచి భారత్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande