
న్యూఢిల్లీ, 14 మే (హి.స.)
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 11 నవంబర్ 2025న జరిగిన ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ 10 మంది నిందితులపై ఇవాళ మొత్తం 7,500 పేజీల చార్జిషీట్ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ, మహరాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. 588 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిందిన ఎన్ఐఏ 395కు పైగా పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో జిహాదీ కుట్ర కోణం ఉన్నట్లు ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలు స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశామని మరికొందరు నిందితులను పట్టుకునేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. కాగా ఈ ఘటనలో పది మందికి పైగా మృతి చెందారు. పేలుడు ధాటికి జనం ఎగిరిపడగా మృతదేహాలు ఛిత్రమైపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..