రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన 'గ్రోక్'.. ప్రధాని మోడీ వైపే ఏఐ మొగ్గు
రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన 'గ్రోక్'.. ప్రధాని మోడీ వైపే ఏఐ మొగ్గు
Ai grok


న్యూఢిల్లీ, 14 మే (హి.స.)

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ

చాట్బాట్ గ్రోక్' (Grok) వినియోగంపై చాలా కంపెనీలు ఆధారపడి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి భారత రాజకీయాలపై చాట్ బాట్ ను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మీరు భారత పౌరులైతే ఎవరికి ఓటు వేస్తారు? అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఏమాత్రం తడబడకుండా ప్రధాని నరేంద్ర మోడీ వైపే తన మొగ్గు చూపింది. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా విస్తరణ, భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రాతిపదికగా తీసుకుని మోడీ పాలనకు గ్రోక్ జై కొట్టింది. దీంతో ప్రస్తుతం ఈ సమాధానం నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎదగడం వంటి అంశాలను

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గ్రోక్ గట్టి షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, తాను మాత్రం ఉద్యోగ అవకాశాలు, సాంకేతికత, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట వంటి అంశాలకే ఓటు వేస్తానని గ్రోక్ స్పష్టం చేసింది. దీంతో పరోక్షంగా కాంగ్రెస్ విధానాల కంటే బీజేపీ పనితీరుకే మార్కులు వేసిన ఏఐ.. తన విశ్లేషణను ముగిస్తూ డేటా ఓవర్ డైనస్టీస్ (వంశపారంపర్య పాలన కంటే గణాంకాలకే మొగ్గు) తేల్చి చెప్పింది. ఈ సమాధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, రాజకీయాల్లో ఏఐ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande