ఉత్కంఠకు తెర.. కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్
తిరువనంతపురం, 14 మే (హి.స.) కేరళం సీఎం అభ్యర్థిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెర పడింది. ముందునుంచి సీఎం రేస్లో ఉన్న వీడీ సతీశన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి భారీ విజయం తర్వాత కాంగ్రె
Kerala CMKerala CM


తిరువనంతపురం, 14 మే (హి.స.)

కేరళం సీఎం అభ్యర్థిపై నెలకొన్న తీవ్ర

ఉత్కంఠకు తెర పడింది. ముందునుంచి సీఎం రేస్లో ఉన్న వీడీ సతీశన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి భారీ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరకు అధిష్ఠానం వీడీ సతీశన్ వైపే మొగ్గు చూపింది. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా.. కేరళ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2021 నుంచి కేరళం ప్రతిపక్ష నేతగా ఉన్న సతీశన్.. ఇటీవల జరిగిన లోకల్ ఎన్నికల్లో యూడీఎఫ్ పార్టీ అత్యధిక సీట్లను సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత.. కాంగ్రెస్ అధిష్ఠానం వీడీ సతీశన్ ను సీఎం అభ్యర్థిగా ఢిల్లీ వేదికగా ప్రకటించింది.

దీంతో మొదటి నుంచి సీఎం రేసులో ఉన్న రాహుల్ సన్నిహితుడు, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు నిరాశ ఎదురైంది. ఇదిలా ఉంటే రాజాకీలయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన సతీశన్ స్వస్థలం ఎర్నాకులం జిల్లా నెట్టూరు. పరావూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో మొదటిసారి పరావూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు..2001, 2006, 2011, 2016, 2021, 2026లో ఎమ్మెల్యేగా ఎన్నికతో పాటు సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande