
జనగామ, 15 మే (హి.స.)
విద్యార్థులకు పాఠశాలల్లో మెరుగైన వసతులు సదుపాయాలు కల్పించే బాధ్యత మాదని, మంచి ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయులదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం లింగాల గణపురం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో అసంపూర్తిగా ఉన్న బాలికల వసతి గృహం పనులు పూర్తి చేయడానికి 1 కోటి 44 లక్షల రూపాయల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. కస్తూర్బా బాలికల పాఠశాలలో రూ.42 లక్షల 50 వేల నిధులతో అదనపు మౌలిక వసతుల కల్పన కోసం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బాలికల వసతి గృహం అసంపూర్తిగానే ఉందన్నారు.
తాను వచ్చిన తర్వాతనే నిధులు మంజూరు చేయించానన్నారు. నియోజకవర్గంలోని 7 కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల మౌలిక వసతుల కల్పన కోసం 18 కోట్ల98 లక్షలు మంజూరు చేయించారన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేడ్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మండలంలోని కోనాయచలం వద్ద పాఠశాల నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో విద్యారంగానికి పెద్దపీటవేశామన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం, అనేక మార్పులు తీసుకొస్తుంది అన్నారు. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులను కూడా కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు