ఆదివాసీల జీవనోపాధి పథకాల అమలుపై కలెక్టర్ క్షేత్ర పరిశీలన..
ఆదివాసీల జీవనోపాధి పథకాల అమలుపై కలెక్టర్ క్షేత్ర పరిశీలన..
Collector


నాగర్ కర్నూల్, 15 మే (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలో గల మన్ననూరు గ్రామ ఆమ్లెట్ విలేజ్ మల్లాపూర్ పెంటలో శుక్రవారం నూతన కలెక్టర్ హేమంత్ కేశవ్ పార్టీ పర్యటించారు. ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం చెంచు మహిళా సమాఖ్య, ద్వారా సేర్ఫ్ తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల పథకం ద్వారా అమ్రాబాద్, పదర మండలాలలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఆదివాసులకు మొదటి ఫేసులో పైలెట్ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను కలెక్టర్ మల్లాపూర్ పెంటను శుక్రవారం ఉదయం సందర్శించి పథకం అమలు తీరును ఆదివాసీలు, సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామములో 34 కుటుంబాలు ఉండగా ఒక్కో కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించేందుకు ( హాని) తేనె ఉత్పత్తిని చేసే 10 బాక్సులను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ. 35 వేల చొప్పున ఖర్చు చేస్తామని కలెక్టర్కు వివరించారు. ప్రతి లబ్ధిదారు నుండి 2 వేల చొప్పున లబ్ధిదారుని పెట్టుబడిగా వారిని ఇన్వాల్వ్మెంట్ చేయడం వలన ఉచితంగా రాలేదు మనం కూడా కొంత వెచ్చించామని భావన వారిలో కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 20 లోపు లబ్ధిదారులందరికీ పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించి 20న మరోసారి మల్లాపూర్ పెంటను సందర్శిస్తానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande