ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద అదృశ్య సరస్వతి నది ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్తలు
ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద అదృశ్య సరస్వతి నది ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్తలు
ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద అదృశ్య సరస్వతి నది ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్తలు


హైదరాబాద్, 15 మే (హి.స.)

శతాబ్దాలుగా కేవలం హిందూ పురాణాలు, భక్తుల నమ్మకాలకే పరిమితమైన త్రివేణి సంగమ అదృశ్య నది సిద్ధాంతానికి సరికొత్త శాస్త్రీయ ఆధారం లభించింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగ, యమున నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భావించే పురాణ నది 'సరస్వతి' భౌతిక ఉనికిని శాస్త్రవేత్తలు భూగర్భంలో విజయవంతంగా గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-NGRI) శాస్త్రవేత్తల బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ అద్భుతమైన ఆవిష్కరణను ప్రపంచానికి వెల్లడించింది.శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ప్రయాగ్రాజ్ గంగా-యమునా దోయాబ్ ప్రాంతంలో భూమి ఉపరితలానికి దాదాపు 10 నుండి 15 మీటర్ల లోతులో ఒక భారీ పురాతన భూగర్భ నది ప్రవాహ మార్గం (Palaeo-river channel) దాగి ఉంది. ఈ భూగర్భ నది కేవలం ఒక చిన్న పాయ మాత్రమే కాదు, ఇది దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల వెడల్పుతో మరియు సుమారు 200 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. దీని వెడల్పు మరియు లోతు ప్రస్తుత గంగా, యమునా నదుల పరిమాణంతో సమానంగా ఉండటం విశేషం. ఈ అద్భుత ఆవిష్కరణను ధృవీకరించడానికి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు 'ఎయిర్బోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ జియోఫిజికల్ టెక్నిక్స్' అంటే హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక సెన్సార్లను ఉపయోగించి భూమి పొరలను స్కాన్ చేశారు. అనంతరం ఆయా ప్రాంతాలలో లోతైన బోర్వెల్స్ డ్రిల్లింగ్ జరిపి, భూగర్భంలో ఉన్న ఇసుక, మట్టి నమూనాలను సేకరించి ఈ పురాతన నది ప్రవాహాన్ని వంద శాతం శాస్త్రీయంగా ధృవీకరించారు.ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్తలు సైన్స్ పరిభాషలో దీనిని 'పురాతన నది మార్గం' అని పిలిచినప్పటికీ, ఈ భూగర్భ మార్గం పురాణాలు, వేదాలలో వివరించిన అదృశ్య 'సరస్వతి నది' యొక్క ప్రవాహ దిశ మరియు లొకేషన్కు సరిగ్గా సరిపోలుతోందని స్పష్టం చేశారు ఈ ఆవిష్కరణ కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకే పరిమితం కాకుండా భవిష్యత్తు నీటి సంక్షోభ నివారణకు ఒక వరంలా మారనుంది. ఎందుకంటే ఈ భూగర్భ నది మార్గంలో ఇప్పటికీ భారీగా నీటి నిల్వలు (Aquifers) ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే అదనపు నీటిని ఆధునిక పద్ధతుల ద్వారా ఈ భూగర్భ మార్గంలోకి మళ్లించడం (ఆర్టిఫిషియల్ రీఛార్జ్) ద్వారా గంగా మైదాన ప్రాంతంలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాన్ని మళ్లీ పెంచవచ్చని శాస్త్రవేత్తలు ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ పరిశోధనతో త్రివేణి సంగమం వద్ద మూడు నదుల కలయిక ఉందనే హిందువుల విశ్వాసం అక్షరాలా నిజమని శాస్త్రీయంగా నిరూపితమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande