'రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం': సూర్యాపేట కలెక్టర్
'రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం': సూర్యాపేట కలెక్టర్
Collector


సూర్యాపేట, 16 మే (హి.స.)

జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను

ఈ మరింత వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో ధాన్యం సేకరణపై వేబెక్ష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ధాన్యం సేకరణ జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభంలో రోజుకు 5 వేల నుండి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపిన ఆయన.. ఇకపై ఆ వేగాన్ని పెంచి రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సమయానికి లారీలు రావడం లేదని, వచ్చిన లారీలను కూడా సెంటర్ ఇంచార్జ్ లు కొన్ని నిర్దిష్ట మిల్లులకు మాత్రమే ఎక్కువగా పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల మిల్లుల వద్ద లారీలు గంటల తరబడి నిలిచి పోతున్నాయన్నారు.

మండల ప్రత్యేక బాధ్యత తీసుకొని, మిల్లుల వద్ద ఎక్కువ లారీలు నిలిచిపోయిన చోట త్వరితగతిన అన్ లోడింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలి. తహసీల్దార్లు అదే విధంగా మిల్లుకు చేరుకున్న లారీలు 12 గంటల లోపు అన్ లోడింగ్ పూర్తి చేయాలని, ఒకవేళ 12 గంటల లోపు అన్ లోడింగ్ ప్రారంభం కాకపోతే, వెంటనే ఆ లారీలను ప్రత్యామ్నాయ అన్ లోడింగ్ పాయింట్లకు మళ్లించాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుండి లారీలో ధాన్యం లోడింగ్ పూర్తి చేసి, 3 గంటల లోపు మిల్లుకు తరలించాలన్నారు. ఏ మిల్లుకు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎంత అన్ లోడింగ్ జరిగింది అనే రిపోర్టుతో పాటు, కొనుగోలు కేంద్రాలకు ఎన్ని లారీలు వస్తున్నాయనే పూర్తి వివరాలను రోజువారీగా ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రాంతాలలో హమాలీల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, దాన్యం లోడింగ్, అన్ లోడింగ్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు మూడు కొన్ని షిఫ్టులలో హమాలీలు పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande