
కామారెడ్డి, 17 మే (హి.స.)
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్
గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సును పోచారం స్వయంగా నడిపి కొంతసేపు డ్రైవర్గా సేవలందించారు. కొండ కింద నుంచి కొండపైకి నాలుగు ట్రిప్పులు నడిపి భక్తులను వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేర్చారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బస్సు నడపడం చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, దేవాలయం తరఫున ఏర్పాటు చేసిన ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని వినియోగించుకోవాలని పోచారం భక్తులను కోరారు. ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా చేరవేయాలని ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు