అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసమే పోలీస్ కార్డెన్ అండ్ సెర్చ్.. సూర్యాపేట డిఎస్పి..
అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసమే పోలీస్ కార్డెన్ అండ్ సెర్చ్.. సూర్యాపేట డిఎస్పి..
Police


సూర్యాపేట, 17 మే (హి.స.)

శాంతి భద్రతల పరిరక్షణ కోసం,

అనుమానిత వ్యక్తుల కదలికల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం పోలీస్ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం, సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి 18 వార్డు సుందరయ్య నగర్ కాలనీ నందు తెల్లవారుజామున పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేపట్టరు. కాలనీలో ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్తులు ఎవరైనా షెల్టర్ తీసుకున్నారా, దొంగతనాలకు గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశాల పై నిఘా ఉంచి తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పట్టణ ఎస్సై ల ఆధ్వర్యంలో 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత రక్షణ కల్పించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడంలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని దీనిలో భాగంగానే ఈ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. కాలనీలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి వాహనానికి అనుమతి పత్రం కలిగి ఉండాలని కోరారు. వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుత సమాజంలో గాంజా ఇలాంటి మాదకద్రవ్యం మన యువతని పట్టిపీడిస్తుందని, ఇలాంటి గంజాయిని మన కాలనీలోకి రానివ్వకూడదని గంజాయి సేవిస్తున్న వారు ఎవరైనా ఉన్నా గంజాయి సరఫరా చేసేవారు ఎవరైనా ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

గంజాయికి అలవాటు పడిన వారిని సత్ప్రవర్తనకు తేవడం కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రం ప్రభుత్వం ఆసుపత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని పిల్లలను అభివృద్ధి పథంలో నడపడానికి ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని సూచించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమతి పత్రాలు లేనటువంటి నెంబర్ ప్లేట్లు లేనటువంటి సుమారు 60 ద్విచక్ర వాహనాలను, పది ఆటోలను సీజ్ చేశారని సూచించారు. అనుమానం ఉన్న వ్యక్తులను ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేయగా గతంలో నేరాలకు పాల్పడిన సుమారు నలుగురిని గుర్తించామని, వీరి వివరాలు తనిఖీ చేసి ప్రస్తుతం ఎలాంటి పనులు చేస్తున్నారని విచారించడం జరుగుతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande