రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్, 17 మే (హి.స.) రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరోసా ఇచ్చారు. శనివారం స
Minister


నాగర్ కర్నూల్, 17 మే (హి.స.)

రైతులకు ప్రభుత్వం అండగా

ఉంటుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం అకాల వర్షానికి కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాశులను మంత్రి జూపల్లి ఆదివారం నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని సైతం గోదాములకు తరలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి ఊహించిన దానికంటే భారీగా పెరగడంతో గోదాములు సరిపోవడం లేదని చెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి కాటన్ మిల్లుల గోదాములు, ప్రైవేట్ గోదాములతో పాటు అవసరమైన చోట ఫంక్షన్ హాళ్లను సైతం వినియోగించుకుని నిల్వ చేస్తున్నామని మంత్రి వివరించారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande