యూపీలో రోడ్డు ప్రమాదం.. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో పది మంది మృతి
యూపీలో రోడ్డు ప్రమాదం.. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో పది మంది మృతి
accident


, 18 మే (హి.స.)

లక్నో:

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృతిచెందారు. సిసయ్య-లఖింపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. లఖింపూర్ నుంచి సిసయ్యకు వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ట్రక్కును వ్యాన్ ఢీకొన్నది. ఉంచ్గావ్, బారెహతా గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. వ్యాన్లో ఉన్న 9 మంది ప్రయాణికులు, ఓ డ్రైవర్ ప్రమాదంలో మరణించినట్లు సర్కిల్ ఆఫీసర్ శంషీర్ బహదూర్ సింగ్ తెలిపారు. ఎదురెదురగా వస్తున్న వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అంజని కుమార్ సింగ్ తెలిపారు.

మృతుల పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాళి అర్పించారు. ఎక్స్ అకౌంట్లో ఆయన స్పందించారు. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు. గాయపడ్డవారికి, బాధితులకు సహకారం అందించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు రెండు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande