రేపు సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ
రేపు సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ
Sp


ఆసిఫాబాద్, 31 మే (హి.స.)

రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా కొఠారి (కెరమెరి మండలం), కాగజ్నగర్ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్, పార్కింగ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల నుండి వచ్చే వారు ఇందిరానగర్ దాటిన తర్వాత ఎడమవైపున పబ్లిక్ మీటింగ్కు ముందు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలపాలని సూచించారు. ఆసిఫాబాద్ నుండి వచ్చే వారికి కాగజ్నగర్ ఎక్స్డ్ వద్ద సర్వీస్ రోడ్డుకు ఎడమవైపున, కాగజ్నగర్ కాటన్ మిల్లు ముందు భాగంలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కాగజ్నగర్ నుండి వచ్చే వారు ఎడమవైపున ఉన్న కన్యకా కాటన్ మిల్లు ముందు భాగంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి కాగజ్నగర్ ఎక్స్రేడ్ వద్ద సర్వీస్ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ అమలులో ఉంటుందని తెలిపారు. సర్వీస్ రోడ్డుపై భారీ వాహనాలకు అనుమతి ఉండదని, కాగజ్నగర్ వైపు నుండి ఎక్స్డ్ వైపు వచ్చే భారీ వాహనాలకు, అలాగే కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుండి కాగజ్నగర్ వైపు వెళ్లే భారీ వాహనాలకు ముఖ్యమంత్రి సభ ముగిసే వరకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కెరమెరి నుంచి ఆసిఫాబాద్ వైపు, అలాగే ఆసిఫాబాద్ నుండి కెరమెరి వైపు భారీ వాహనాలను అనుమతించబోమని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande