బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల కోసం వెయ్యి కోట్లు విడుదల: మంత్రి పొంగులేటి
బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల కోసం వెయ్యి కోట్లు విడుదల: మంత్రి పొంగులేటి
Minister


ఖమ్మం, 31 మే (హి.స.)

కూసుమంచి మండల కేంద్రంలోని శ్రీ

రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు రూ.3 కోట్ల 30 లక్షల 50 వేల వ్యయంతో ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ లతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న

అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం మొదటి విడతలో రూ.1000 కోట్లు విడుదల చేశామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం భద్రాచలానికి ఒక్క పైసా ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించడమే కాకుండా.. రూ.300 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. కూసుమంచిలోని చారిత్రాత్మక శివాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. అన్ని మతాలను సమానంగా చూస్తూ మతాలకు అతీతంగా ఆలయాలు, చర్చిలు, మసీదులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే, కొన్ని పార్టీలు మాత్రం దేవుడి గుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిధులు కేటాయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande