
డిల్లీ, 01 జూన్ (హి.స.)
మే నెలలో యూనిఫైడ్ పేమెంట్స్
ఇంటర్ఫేస్ (యూపీఐ) డిజిటల్ చెల్లింపుల జోరు కనిపించింది. ఈ నెలలో మొత్తం 23.20 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరగ్గా, వాటి విలువ 30 లక్షల కోట్ల చేరువలో ఉంది. ఇది దేశంలో యూపీఐ చెల్లింపులు నిరంతరం ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయో తెలియజేసే విధంగా ఉంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం, వ్యాపారులు సైతం యూపీఐ లావాదేవీలను అలవాటు చేసుకోవడంతో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోతున్నాయి.
యూపీఐ చెల్లింపులు పెరిగిపోవడం భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సైతం వెన్నుముకగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇదిలా ఉంటే ఇండియాలో యూపీఐ చెల్లింపుల కోసం సైతం అనేక యాప్స్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ పే, గూగుల్ పేతో పాటు వందల కొద్ది యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ సైతం పేమెంట్స్ ఆప్షన్ తీసుకువచ్చింది. యూపీఐ ట్రాన్షక్షన్స్ పై మొదట్లో ప్రజలు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి సైబర్ నేరాలు జరక్కపోవడంతో నమ్మకం పెంచుకుని డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..