యూపీఐ, ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్: జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
యూపీఐ, ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్: జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
LPG


హైదరాబాద్, 01 జూన్ (హి.స.)

దేశవ్యాప్తంగా నేటి (సోమవారం) నుండి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) మరియు వంటగ్యాస్ (LPG) సిలిండర్లకు సంబంధించి పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజల భద్రత, సేవల సరళీకరణ లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి.యూపీఐ (UPI) లో వచ్చిన మార్పులు:

ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఇకపై వినియోగదారులు ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు, అవతలి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో ఉన్న అసలు పేరు (Verified Legal Name) యూపీఐ పిన్ ఎంటర్ చేయడానికి ముందే స్క్రీన్పై కనిపిస్తుంది. అలాగే పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు కేవలం పిన్ నంబర్ సరిపోదు; అదనపు రక్షణ కోసం వేలిముద్ర (Fingerprint) లేదా ఫేస్ లాక్ వంటి బయోమెట్రిక్ నిర్ధారణ తప్పనిసరి చేశారు. దీంతో పాటు, వినియోగదారులు తమ యాప్ల ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేలా పరిమితి విధించారు. ఏటీఎంల ద్వారా జరిపే యూపీఐ కార్డ్లెస్ నగదు విత్డ్రాయల్స్ కూడా ఇకపై నెలవారీ ఉచిత బ్యాంక్ విత్డ్రాయల్స్ పరిమితి కిందికే వస్తాయి.ఎల్పీజీ (LPG) కొత్త నియమాలు:

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటగ్యాస్ పంపిణీ నియమాల్లో మార్పులు చేశాయి. ఇళ్లలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్నవారు, అది యాక్టివేట్ అయిన 30 రోజులలోపు తమ పాత ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత తదుపరి సిలిండర్ బుక్ చేయడానికి పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల కనీస వ్యవధిని నిర్దేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande