బీహార్.రాష్ట్రంలో ఔరంగాబాద్ వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో.మరో.మహిళ మృతి
సంగం, 10 జూన్ (హి.స.) , : బిహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్ వద్ద ఆదివారం అర్థరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గయలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్న సంగం పట్టణానికి చెందిన బొమ్మిశెట్టి లక్ష్మమ్మ (50) మంగళవారం అర్థరాత్రి మృతి చెందారు. సంగం న
బీహార్.రాష్ట్రంలో ఔరంగాబాద్ వద్ద  జరిగిన రహదారి ప్రమాదంలో.మరో.మహిళ మృతి


సంగం, 10 జూన్ (హి.స.)

, : బిహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్ వద్ద ఆదివారం అర్థరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గయలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్న సంగం పట్టణానికి చెందిన బొమ్మిశెట్టి లక్ష్మమ్మ (50) మంగళవారం అర్థరాత్రి మృతి చెందారు. సంగం నుంచి వారణాశికి 39 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు ఆదివారం అర్థరాత్రి ప్రమాదానికి గురి కాగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 15 మందికి గయలోని వైద్యశాలలో మంగళవారం వరకు చికిత్స అందించి వారిని ప్రత్యేక బస్సులో వారి స్వస్థలాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మ ఆమె భర్త వెంకటేశ్వర్లు గయలోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి లక్ష్మమ్మ మంగళవారం ప్రాణాలొదిలారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande