ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న వర్షాలు
ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న వర్షాలు
vaana


కేదారనాథ్, 28 జూలై (హి.స.)

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న విస్తార వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. పర్వత ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాల వల్ల అలకనంద, మందాకిని, గంగ వంటి ప్రధాన నదుల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రవహిస్తున్నాయి. లోతట్టు మరియు నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం మరియు రహదారులు దెబ్బతినడం వంటి కారణాలతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేదారనాథ్ తో పాటు చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసారు. రుద్రప్రయాగ్, గుప్తకాశి, సోన్‌ప్రయాగ్ వంటి సురక్షిత ప్రాంతాలలోనే యాత్రికులను నిలిపివేసి తాత్కాలిక వసతి సౌకర్యాలను కల్పించారు.

మరోవైపు కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారులతో పాటు పలు అనుసంధాన రహదారులపైకి భారీగా రాళ్ళు, మట్టి వచ్చి చేరడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, విపత్తు నిర్వహణ బృందాలు యంత్రాల సహాయంతో మట్టిని తొలగించి రహదారులను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యాయి. వాతావరణం అనుకూలించి రహదారులు సురక్షితంగా మారే వరకు ప్రయాణాలు చేయవద్దని మరియు అధికారుల సూచనలను తప్పక పాటించాలని భక్తులను, స్థానికులను యంత్రాంగం కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande