
ముంబై, 15 జూన్ (హి.స.)
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు నెలకొని.. భారత స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు రాకెట్ దూసుకెళ్లాయి. గత 107 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరుదేశాలు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం, ప్రపంచ మార్కెట్లలో క్రూడాయిల్ (కారణంగా చమురు) ధరలు భారీగా తగ్గడం స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ నింపింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలమార్గాన్ని తిరిగి తెరిచేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు