ఈ రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
ఈ రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold


ముంబై, 19 జూన్ (హి.స.) ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంపై పది రూపాయల చొప్పున తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,500 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,37,040 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,11, 120 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ1,49,500. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,500. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,37,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,69,900 ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande