పీఎం కిసాన్ నిధులు విడుదల
కోల్‌కతా, 20 జూన్ (హి.స.): పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ 26వ విడత పీఎం–కిసాన్‌ నిధులను విడుదల చేశారు. శనివారం హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌ పర్యటనలో ఉ‍న్న మోదీ బటన్‌ నొక్కి రైతులకు డబ్బులు రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం కిసాన్‌కు
PM Modi  at G7 Summit


కోల్‌కతా, 20 జూన్ (హి.స.): పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ 26వ విడత పీఎం–కిసాన్‌ నిధులను విడుదల చేశారు. శనివారం హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌ పర్యటనలో ఉ‍న్న మోదీ బటన్‌ నొక్కి రైతులకు డబ్బులు రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం కిసాన్‌కు సంబంధించిన రూ. 2 వేలు అకౌంట్లలో జమ‍య్యాయి. ఈ పథకం ద్వారా మెుత్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లు జమయ్యాయి.

2019లో ఈ పథకం ప్రారంభం కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఏటా మూడు విడతలలో ఈ డబ్బును అందజేస్తుంది. పీఎం కిసాన్‌ ద్వారా ఒక్కో రైతుకు మెుత్తం రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande