
న్యూఢిల్లీ, 22 జూన్ (హి.స.)
తెలంగాణ పాలిటిక్స్ (Telangana
Politics)లో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ మధ్యకాలంలో నిత్యం ఉప్పు, నిప్పులా ఉంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఒకే సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఢిల్లీలో జరగబోయే కీలక భేటీ ఇందుకు వేదిక కానుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ భేటీ ఖరారైంది. 'ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటాను.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయండి' అంటూ అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓ అధికారిక లేఖ రాశారు. సీఎం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ భేటీని ఖరారు చేయడమే కాకుండా, స్వయంగా తాను కూడా ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో జరగబోయే ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో టేకోవర్ (Hyderabad (Metro Metro Takeover), మెట్రో ఫేస్ టు విస్తరణ (Phase-2 Expansion), అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు