వానాకాలం వ్యాధులు.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
వానాకాలం వ్యాధులు.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
Collector


నారాయణపేట, 22 జూన్ (హి.స.)

వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలు టైఫాయిడ్ మొదలగు వ్యాధుల నియంత్రణ చర్య లపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ అంశాలపై అన్ని శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో ముందుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కే. జయ చంద్ర మోహన్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని జిల్లా అధికారులకు తెలపగా, ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీకాంత్ ఈ కార్యక్రమం మొత్తం వివరాలను పి.పి.టి. ద్వారా అన్ని శాఖల అధికారులకు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరంగా డ్రైడే ఆక్టివిటీస్ నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ సర్వీలెన్స్ నిర్వహించాలని శానిటేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande