బుద్ధుని స్పూర్తితో ప్రజలు ఆలోచన విధానం మార్చుకోవాలి.. మంత్రి జూపల్లి
బుద్ధుని స్పూర్తితో ప్రజలు ఆలోచన విధానం మార్చుకోవాలి.. మంత్రి జూపల్లి
Minister


సూర్యాపేట, 22 జూన్ (హి.స.)

బుద్ధుని స్పూర్తితో ప్రజల ఆలోచనా

విధానం మార్చుకోవాలి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రానికి 1.61 లక్షలు, ఈటూరు గ్రామ సమీపంలో ఉన్న గాజుల బండ వద్ద ఉన్న బౌద్ధ ఆనవాలు వెలికితీయడానికి అభివృద్ధి పనులకు 23 లక్షల రూపాయలు మంజూరు కాగా సోమవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుతో కలిసి అభివృద్ధి పనులకు ఫణిగిరి గ్రామంలో గల బౌద్ధ క్షేత్రం వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందిని అన్నారు. ప్రపంచంలోనే ఫణిగిరి బౌద్ధ క్షేత్రం రెండవ స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు.

ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తవ్వకాలలో బయట పడ్డ బౌద్ధ శిలా సంపదను అమెరికాలోని న్యూయార్క్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం ద్వార ఫణిగిరి కీర్తి ప్రపంచానికి తాకిందని అన్నారు. ఫణిగిరిలో పర్యాటకుల సందర్శన కోసం రోడ్లు, మౌలిక వసతులు, మ్యూజియం కోసం ప్రత్యేకంగా 5 కోట్లు మంజూరు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ వెనక బడిన తుంగతుర్తి నియోజక వర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచడానికి భారీగా నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి జూపల్లిని మరో బుద్ధుడిగా ఎమ్మెల్యే మందుల సామేలు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande