
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
ఇవాళ సాయంత్రం భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఇవాళ 3:30 గంటల నుండే ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు లాగౌట్లు (Early Logouts) కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని సంస్థల యాజమాన్యాలకు సూచన చేశారు. విపత్కర వాతావరణ పరిస్థితుల్లో అత్యవసర సేవలు సజావుగా సాగడానికి, రోడ్లపై మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారుల భద్రత రిత్యా యాజమాన్యాలు సహకరించాలని రిక్వెస్ట్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..