రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.పై సిట్ విచారణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.పై సిట్ విచారణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.పై సిట్ విచారణ


విజయవాడ, :, 27 జూన్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ అనంతర పరిణామాలపై సురేష్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన తరువాత సీఐ నాగరాజుకి సురేష్ సహకరించినట్లు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు.

పరారీలో ఉన్న ఇద్దరు పోలీసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. ఇప్పటికే హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని ఇళ్లకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. వారిద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో మరికొందరి పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఏసీపీ మానసతో వేర్వేరుగా మాట్లాడారు. సాయికృష్ణ నేరాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande