
హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
ప్రత్యేక సత్వర ఓటరు జాబితా
సవరణ కార్యక్రమంలో భాగంగా బి ఎల్ ఓ బృందం శనివారం తార్నాకలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ప్రక్రియ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన ప్రక్రియ అని అన్నారు. పరిశుభ్రమైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఎన్నికల సంఘానికి పూర్తిస్థాయిలో సహకరిస్తూ, బూత్ స్థాయిలో ఎస్ఐర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు విశ్వసనీయ ఓటరు జాబితా పునాది అని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించి తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..