మహారాష్ట్రలో మరో 24 గంటల్లో టెట్ పరీక్ష.. ప్రశ్నపత్రం లీక్!
మహారాష్ట్రలో మరో 24 గంటల్లో టెట్ పరీక్ష.. ప్రశ్నపత్రం లీక్!
tet


హైదరాబాద్, 27 జూన్ (హి.స.)

పరీక్షకు సరిగ్గా 24 గంటల ముందు ప్రశ్నపత్రం లీక్ కావడంతో మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) వాయిదా పడింది. ఠాణేలో జరిగిన పోలీసుల తనిఖీల్లో ప్రశ్నపత్రాన్ని స్వాధీనం చేసుకోగా.. ఈ వ్యవహారంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వారి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై మహారాష్ట్ర విద్యాశాఖ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రెస్నోట్ రూపంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే కొత్త పరీక్ష తేదీని కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande